సిరా న్యూస్,పల్నాడు;
మాచవరం మండలం వేమవరంలో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన జక్కుల సైదులు ఇంట్లో 13 సవర్ల బంగారం, రూ. 2 లక్షల నగదును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఉదయం పొలంపనుల నిమిత్తం వెళ్లిన సైదుల కుటుంబ సభ్యులు సాయంత్రానికి రాగానే ఇంటి తాళాలు పగలగొట్టడం గమనించి చూడగా బీరువాలో ఉన్న నగదు అపహరించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు కేసును విచారిస్తున్నారు.