మంత్రి విశ్వరూపం హాట్ కామెంట్స్
సిరా న్యూస్,అమలాపురం;
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పురపాలక పరిధిలోని వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్ పాల్గోన్నారు. వాలంటీర్లు చేస్తున్న సేవ చాలా అద్భుతమైనదని అయన కొనియాడారు. ప్రభుత్వం ఇచ్చే కోట్లాది రూపాయలు వాలంటీర్ల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఎంతో సేవ చేస్తున్న వాలంటీర్లను దొంగలుగా పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు నాయుడు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
ఎలాంటి తప్పులు లేకుండా చిత్తశుద్ధితో చేస్తున్న వాలంటీర్లకు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని అన్నారు.