సిరా న్యూస్,రేణిగుంట;
మంగళవారం ఉదయం 10.15 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, పంచాయితీ రాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రికి జెసి శుభం బన్సల్, మునిసిపల్ కమిషనర్ తిరుపతి నారపు రెడ్డి మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఆర్డీఓ లు నిషాంత్ రెడ్డి, రవి శంకర్ రెడ్డి, ఎస్ డి సి ప్రోటోకాల్ చంద్రశేఖర్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తరువాత అనంతరం ఉప ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో షార్ లో కార్యక్రమంలో పాల్గొనడానికి బయల్దేరి వెళ్లారు.