సిరా న్యూస్,విజయనగరం;
ఏపీలో డయేరియా బాధితులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియాతో 10 మంది మృతి చెందారు. వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సొంతంగా ఆర్థిక సాయం చేస్తానని పవన్ ప్రకటించారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి మరింత పరిహారం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. సోమవారం గుర్ల గ్రామానికి వెళ్లి డయేరియా బాధితులను పవన్ పరామర్శించారు.