Payal Foundation: మాట ఇచ్చారు… నిలుపుకున్నారు…

సిరా న్యూస్, ఆదిలాబాద్: 

మాట ఇచ్చారు… నిలుపుకున్నారు…

ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం పరిధిలోని కొత్తగూడ గ్రామంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు బోర్లు వేయించి ఉదారత చాటుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం గ్రామానికి వెళ్లిన ఆయనకు పలువురు గ్రామస్తులు నీటి ఎద్దడి గురించి వివరించారు. తాగునీటికి తీవ్ర ఇబ్బంది ఉందని చెప్పడంతో చలించిపోయిన పాయల్ శంకర్, ఎన్నికల తర్వాత తప్పనిసరిగా తన సొంత నిధులతో బోర్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వయంగా గ్రామానికి వెళ్లి బోర్లు వేయించారు. ఈ మేరకు గ్రామస్తులతో కలిసి పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో దశలవారీగా గ్రామంలోని అన్ని సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెంట నాయకులు కుంచెట్టి సంతోష్, ముకుందరావు, వేద వ్యాస్, దత్తు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *