సిరా న్యూస్, బేల
గ్రామాలకు అభివృద్ధి ఫలాలు అందాలన్నదే బీజేపీ లక్ష్యం
* ఆదిలాబాద్ ఎంఎల్ఏ పాయల్ శంకర్
* హై లెవెల్ బ్రిడ్జి పనులకు భూమి పూజ
మారుమూల గ్రామాల్లో కూడా అభివృద్ధి ఫలాలు అందాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆదిలాబాద్ ఎంఎల్ఏ పాయల్ శంకర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ నియోజకవర్గ బేల మండలంలోని మునియార్పూర్. దేగావ్ గ్రామాల మధ్యలో గల వాగు కోసం హై లెవెల్ బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేలా మండలంలోని దహనం, మనియార్పూర్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న ఈ వాగు వర్షాకాలంలో ఉప్పొంగి ఇతర ప్రాంతాల నుండి వేరు చేస్తుందని, అత్యవసర సమయాల్లో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. అందుకుగాను హై లెవెల్ వంతెన కోసం ఏడు కోట్ల పది లక్షల రూపాయలు మంజూరు చేసి పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇంతే కాకుండా బేల మండలంలోని కాప్రి నుండి మెయిన్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ కోసం 60 కోట్ల నిధులు అవసముండగా కేంద్ర ప్రభుత్వం నుండి 25 కోట్లు మొదటి విడతగా మంజూరు చేయించామని అన్నారు. అధికారుల సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కలిపి ఈ రోడ్డు పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఓట్లు వేసిన ప్రాంతం ఓట్లు వేయని ప్రాంతం అంటూ ఏదీ లేదు నేను ప్రజల మనిషిని వారి సేవ చేయడానికి ఎన్నుకోబడిన వాడిని కాబట్టి ఏ ప్రాంతానికైనా అభివృద్ధి కోసం పాటుపడి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులను చేయిస్తానని అన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎలాగైతే తనను ఆదరించి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమకు మద్దతు తెలిపాల్సిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో అదధికారులు, జిల్లా నాయకులు బేల మండల నాయకులు తదితర కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.