Payal Shankar: మూడో సారి మోడీని ప్ర‌ధాన మంత్రిని చేద్దాం

సిరాన్యూస్‌,జైన‌థ్‌
మూడో సారి మోడీని ప్ర‌ధాన మంత్రిని చేద్దాం
* మోడీ పాలనకు ఆకర్షితులై బీజేపీలోకి చేరిక‌
* ఆదిలాబాద్ ఎంఎల్ఏ పాయల్ శంకర్
మూడో సారి మోడీని ప్ర‌ధాన మంత్రిని చేద్దామ‌ని ఆదిలాబాద్ ఎంఎల్ఏ పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల ఖాప్రి గ్రామంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ దంతెల రవీందర్ తో పాటు 200 మంది కార్యకర్తలు సోమ‌వారం బీజేపీలో చేరారు. అలాగే బెల్లూరి ప్రవీణ్ ఆధ్వర్యంలో 100 మంది బెల్లూరి గూడ నుండి పెద్ద ఎత్తున యువకులు, గ్రామస్థులు భారతీయ జనతా పార్టీలోకి ఆదిలాబాద్ ఎమ్మేల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో చేరారు. వారందరికీ బీజేపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ కాంగ్రెస్, బిఆర్ఎస్‌ లు ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవలనే ఆలోచనతోనే ఉన్నాయ‌ని, అందుకే సాధ్యం కాని హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం మర్చిపోతున్నాయని అన్నారు. బిఆర్ఎస్‌ పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా నిధులు దారిమళ్లించిందని తెలిపారు. కోట్ల రూపాయలు ప్రధానమంత్రి అవాస్ యోజన క్రింద మంజూరయ్యాయి, ఆ నిధులు డబల్ బెడ్రూం కోసం వాడుకున్నారు కానీ ఇక్కడ కూడా నరేంద్ర మోదీ పేరుగాని కేంద్రం నిధులని గాని చెప్పలేదు, ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమేనని అన్నారు. ఇక 6 గ్యారంటీల ఆశచూపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చి హామీల సంగతి ఏమయ్యింది అని ప్రశ్నిస్తే బిఆర్ఎస్‌ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది, మేము హామీలు తీర్చలేము అని చేతులెత్తే ప్రయత్నం చేస్తోంది అని అన్నారు. మోడీ పేదలకు అవాస్ యోజన, పేదలకు హెల్త్ కార్డులు ఇలా చెప్పుకుంటుపోతే వందల సంక్షేమ పథకాలు పేదల కోసం, రైతులకు కోసం అందించారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఆదరించారు. అందుకు మీ అందరికి కృతజ్ఞుణ్ణి అని అన్నారు. నేను అధికారంలో ఉన్న లేకున్నా మీ కోసం పోరాడాను… ఇప్పుడు కూడా మీకు ఏ సమస్య ఉన్న మీకోసం నెనున్నానని అన్నారు. నన్ను ఆదరించినట్టే భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థికి ఓట్లేసి నరేంద్రమోడీని మళ్ళీ ప్రధానమంత్రి ని చేద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాందాస్ చిలుకూరి జ్యోతి రెడ్డి, రమేష్ పోతరాజు, రాకేష్ రెడ్డి అశోక్ రెడ్డి, రమేష్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, భూమన్న సాయి, రూపేష్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *