సిరాన్యూస్, ఆదిలాబాద్
కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే
* జిల్లాలో రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చ
కేంద్ర మంత్రి అర్జున్ ముండా బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. స్ధానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఆయనను ఎమ్మెల్యే పాయల్ శంకర్ , అలాగె బిజెపి అదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గోడం నగేష్ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కౌన్సిలర్ లు పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.