సిరాన్యూస్, ఆదిలాబాద్
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు
బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలనకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరడానికి ముందుకు వస్తున్నారని ఆదిలాబాద్ పార్లమెంటు ఇన్చార్జి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బేల మండలం చప్రాల గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బిజెపికి గ్రామాలలో విశేష ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం బిజెపి ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బేల మండల నాయకులు పాల్గొన్నారు