సిరాన్యూస్, ఆదిలాబాద్
మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ కావాలి
* ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
* మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ
మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బీజేపి అభ్యర్థి గొడం నగేష్ కు మద్దతుగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా పట్టణంలోని రామ్ నగర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కేంద్ర సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ప్రజలకు మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. అదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోడీకి బహుమతి ఇవ్వాలని కోరారు. ప్రధాని మోడీ పదేళ్ల పాలనలో ప్రజలకు సుపరిపాలన అందించారని అన్నారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా పట్టణ నాయకులు తదితరులు ఉన్నారు.