సిరాన్యూస్, జైనథ్
పెండల్ వాడ హనుమాన్ ను దర్శించుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్
హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండల్ వాడ గ్రామంలోని ప్రముఖ హనుమాన్ ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ , మాజీ ఎంపీ రాథోడ్ రమేష్‌లతో కలిసి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరు సుఖ, శాంతులతో వర్ధిల్లాలని, హనుమంతుడి చల్లని దీవెనలు అందరిపై ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల కో ఇంచార్జ్ అశోక్ ముస్తాపురే, స్థానిక బీజేపీ నాయకులు అశోక్, నరేష్, విశాల్, రాజు, ముకుందరావు, భూమన్న తదితరులు పాల్గొన్నారు.