సిరాన్యూస్, ఆదిలాబాద్
బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
పట్టణంలో ఎన్నికల ప్రచారం
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్ భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం గాంధీ పార్క్ లలో బీజేపి ఎంపీ అభ్యర్థి నగేష్ , పార్లమెంట్ ఇంచార్జ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈసందర్భంగా సాధకులతో ముచ్చటిస్తూ బీజేపీ పార్టీని ఆదరించాలని కోరారు. అనంతరం అక్కడినుండి ఎమ్మెల్యే, పార్లమెంట్ అభ్యర్థి బైక్ నడుపుతూ ప్రచారం నిర్వహిస్తూ కొమురం భీమ్ చౌరస్తా వద్ద చేరుకున్నారు. అనంతరం వాకర్స్ అసోసియేషన్ సభ్యులను కలసి వారితో కాసేపు ముచ్చటించారు. దేశంలో సుపరిపాలన అందిస్తున్న మోడీకి మరోసారి అవకాశం ఇస్తూ మూడోసారి ప్రధానిగా చేయాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో అదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ బిందాస్ గ్రూప్ వారితో కలిసి నరేంద్ర మోడీ పాలన లో దేశం బాగుందని ఈసారి కచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు