సిరాన్యూస్, బేల
కమలం పువ్వుకు ఓటేద్దాం.. మోడీని మరోసారి ప్రధానిని చేద్దాం : ఎమ్మెల్యే పాయల్ శంకర్
బేల మండల కేంద్రంలో బీజేపీ భారీ రోడ్ షో…
భారీగా తరలివచ్చిన జనం
కమలం పువ్వుకు ఓటేద్దాం.. మోడీని మరోసారి ప్రధానిని చేద్దామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ పాల్గొన్నారు.అనంతరం స్థానిక శివాజీ కూడలి వద్ద కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మాట్లాడారు. కేంద్రంలో నాలుగు వందలకు పైగా స్థానాలతో ఏర్పడబోతున్న ప్రభుత్వంలో మీ ప్రతినిధిగా నన్ను గెలిపించి భాగస్వామ్యం చేయాలని కోరారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని చేపట్టిన నరేంద్రమోదీకి కృతజ్ఞతతో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న బీజేపీ పరిపాలనను మళ్లీ కొనసాగించే ఆవశ్యకతను వివరించి, దేశ అభ్యున్నతి కోసం, ఉజ్వలమైన దేశ భవిష్యత్తు కొరకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, వివిధ పదాధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.