సిరాన్యూస్, ఆదిలాబాద్
రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ, స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి కనబడుతుందన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్న గ్రామపంచాయతీలలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక, కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో గ్రామపంచాయతీలు ఉన్నాయన్నారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్‌లలో డీజిల్ పోపించుకొని పరిస్థితిలో ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చిందని ఆరోపించారు. గత ప్రభుత్వం గ్రామపంచాయతులను పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.