సిరా న్యూస్ అదిలాబాద్
కంచి పీఠాధిపతి ఆశీర్వాదం తీసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్..అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం నాడు కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు. చతుర్మాసం దీక్ష ముగించుకొని వారణాసి నుంచి కంచికి వెళ్తున్న పీఠాధిపతి రెండు రోజులపాటు అదిలాబాదులో బస చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతిని పాయల్ శంకర్ కలిసారు. దేశం కోసం, సనాతన ధర్మం కోసం కట్టుబడి పని చేయాలని స్వామిజీ ఎమ్మెల్యేకు సూచించారు.