పెద్దపల్లి జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలి

సిరా న్యూస్,పెద్దపల్లి;

పెద్దపల్లి జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత సంఘాల నాయకులు సీ ఎం రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు ఎస్సి, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్ కలిపించిన మహనీయులని వారి పేరును అంబేడ్కర్ జిల్లాగా మార్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో మహనీయు ల ఆశయ సాధన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి కైలసం, దళిత నాయకులు కలవల మల్లేష్,తాండ్ర శ్రీనివాస్, మాస్ పట్టణ అధ్యక్షుడు కండె కరుణకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *