సిరాన్యూస్, ఓదెల
కాజీపేట-బల్లార్షా మధ్య రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్
పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల మద్య మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 12 బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కి భీభత్సంగా మారింది. ఈ ప్రమాద తీవ్రతకు చైన్నె డిల్లీ ప్రధాన రైలు మార్గంలో మూడు లైన్ లు ద్వంసమ య్యాయి. వంద మీటర్ల వరకు పట్టాలు విరిగి చెల్లాచెదురుగాపడ్డాయి, విద్యుత్ పోల్స్ విరిగి పవర్ సప్లైకి అంతరాయం ఏర్పడిగూడ్స్ ప్రమాదంతో కాజీపేట బల్లార్షా మద్య రైళ్ళ రాకపోకలకు అంత రాయం ఏర్పడి ఎక్కడిక్కడే రైళ్ళు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. రైల్వేకు భారీగా నష్టం వాటిల్లింది. రాత్రికి రాత్రే రైల్వే అధికారులు, సిబ్బంది ప్రమాద ఘటన స్థలానికి చేరుకొని మరమ్మతు పనులు చేపట్టారు.గూడ్స్ రైలు పట్టాలు తప్పి కాజీపేట బల్లార్షా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో రైల్వే శాఖ వాయువేగంతో మరమ్మతు పనులు చేపట్టింది. వెయ్యి మంది సిబ్బంది 24 గంటలు అవిశ్రాంతంగా పనిచేసి ధ్వంసమైన 12 బోగీలను, విద్యుత్ స్థంభాలను భారీ క్రేన్లు, జేసీబీల సాయంతో తొలగించారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఘటన స్థలం వద్దనే ఉండి పనులు పర్యవేక్షిం చారు. చూస్తుండగానే వంద మీటర్లు కొత్తగా రైల్వే ట్రాక్ ఏర్పాటు చేశారు. బుదవారం రాత్రి 8 గంటలకు గూడ్స్ రైలుతో పెద్దపల్లి నుంచి రామ గుండం వరకు ట్రయల్ రన్ నిర్వహించారు.ప్రస్తుతం ఒక ట్రాక్ వినియో గంలోకి రాగా,ధ్వంసమైన మిగతా రెండు లైన్ లను శరవేగంగా మరమ్మతులు చేస్తున్నారు. గురువారం ఉదయం వరకు పూర్తి చేసి రైళ్ళను నడిపేందుకు రైల్వేఅధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.