సిరాన్యూస్, సామర్లకోట
పెద్దాపురంలో సామూహిక సరస్వతీ దేవి పూజ
పెద్దాపురం పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో బుధవారం సామూహిక సరస్వతీ దేవి పూజ నిర్వహించారు. ఈసందర్బంగా ఆలయ ప్రాంగణంలో వేద పండితులు వేద మంత్రాలతో సామూహిక సరస్వతీ దేవి పూజను పిల్లలతో నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఉచ్చితంగా సరస్వతీ దేవి ఫోటోలను, పప్పు, బెల్లం ను పిల్లలకు అందించారు. పిల్లలు సరస్వతీ దేవికి ఇష్టమైన తెలుపు వస్త్రాలను ధరించి పూజలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.