సిరాన్యూస్, సామర్లకోట
పెద్దాపురంలో శ్రీ రామ ధనస్సును దర్శించుకున్న భక్తజనం
అయోధ్యలో శ్రీ రాముడికి సమర్పించే (కోదండం ) 13 కేజీల వెండి ,1 కేజీ బంగారం తో తయారు చేసిన ధనస్సును గురువారం భక్తుల సందర్శనార్ధం కాకినాడ జిల్లా పెద్దాపురం మైన్ రోడ్లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేశారు. శ్రీ రామ ధనస్సును చూడటానికి భక్తులు పోటెత్తారు. భక్తులు వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా రోడ్డు పై సైతం బారులు తీరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధనార్చకులు శ్రీనివాసు, వాసవి ట్రస్ట్ మెంబర్ కృష్ణ , జనసేన పార్టీ కారెడ్ల రాజా, జానసేనా పార్టీ ముఖ్య అధినేత తుమ్మల రామ స్వామి , పెద్దాపురం లక్ష్మి డ్రై ఫ్రూట్ షాపు యజమాని ప్రసాద్,భక్తులు పాల్గొన్నారు.