సిరా న్యూస్, పెంబి:
ఆధార్ కేంద్రం లేక అవస్థలు…
+ పెంబిలో శాశ్విత ఆధార్ కేంద్రం ఏర్పాటుకు మండల వాసుల డిమాండ్
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఆధార్ ఈ కేవైసీ తప్పనిసరి అని పుకార్లు వ్యాపించడంతో ప్రజలు ఆధార్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. పెంబి మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ఖానాపూర్, కడెం ఆధార్ సెంటర్ల వద్ద పెంబి వాసులు పడిగాపులు కాస్తున్నారు. మండల కేంద్రం నుండి సుమారు 30-40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడంతో మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే పెంబి మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేసి ప్రజల కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు. కాగా ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సల్ల స్వప్నిల్ రెడ్డి ఉన్నతాధికారులకు విన్నవించారు. త్వరలోనే మండలంలో ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారు.
సల్ల స్వప్నిల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు