సిరా న్యూస్,అనకాపల్లి;
పరవాడ మండలం పరిధిలో 79 మరియు 85వ వార్డు సంబంధించి లంకెలపాలెం,దేశపాత్రునిపాలెం ప్రాంతాలకు సంబంధించి పలు కార్యక్రమాలకు పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ శంకుస్థాపన చేసారు. కమ్యూనిటీ హాలు, డ్రైనేజీలు, సిసి రోడ్లు మరియు నాలుగు సచివాలయాలు జిజిఎంసి ఫండ్స్, జీవీఎంసీ, జనరల్ ఫండ్స్, మొత్తం మీద సుమారు ఒక కోటి 48 లక్షలుతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒకపక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇన్ని రకాలైన సంక్షేమ పథకాలు ప్రజలందరికి అందిస్తూ ఎక్కడ పార్టీ చూడకుండా కులం,మతం చూడకుండా రాజకీయం చూడకుండా మతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా అభివృద్ధి పనులుకు పెద్దపేట వేస్తుంది ఈ ప్రభుత్వమని అన్నారు.
కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేనటివంటి లంకెలపాలెం హైస్కూల్ని నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది.ఆర్కే లేఔట్ గాని ఇక్కడున్నా రింగ్ రోడ్డు గాని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరిగింది. వీటన్నిటిమీద వచ్చే నెల ఒకటో తారీకు నుంచి ప్రతి సచివాలయం పరిధిలో మన ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది, గత ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగిందన్నది సచివాలయంలో విడుదల చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వైయస్సార్ సీనియర్ నాయకులు సుందరపు అప్పారావు, 79 వ వార్డు రౌతు శ్రీనివాస్, 85 వ వార్డు ఇల్లపు ప్రసాద్ వైఎస్ఆర్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.