Penganga Jathara: గంగా జాతర చూద్దము రా రండి…!

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

గంగా జాతర చూద్దము రా రండి…!
+ ఈ నెల 28న మొదలైన జాతర
+ భారీగా తరలి వస్తున్న భక్తులు
+ సందడిగా మారిన డొల్లార పెన్‌గంగా నదీ తీరం

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని డొల్లార గ్రామ సమీపంలో పెన్‌గంగా నది తీరంలో ఏట నిర్వహించే గంగా జాతర ఈ నెల 28న ప్రారంభమైంది. ఆదివారం మహారాష్ట్ర పాఠన్‌బోరిలోని రామనంద్, మాదవ్‌ రావ్‌ మహారాజ్‌ సంస్థాన్‌ సభ్యులు నెత్తిన మహారాజ్‌ పాదుకులతో పాదయాత్రగా నదికి చేరుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని ప్రతిష్థించి, దహి కాల హండీ నిర్వహించి, జాతర ప్రారంభించారు.

ఆకట్టుకుంటున్న జాతర…

ఏట పుష్యమాసం పౌర్ణమి తరువాత నిర్వహించే ఈ జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జాతర సమయంలో గంగమ్మ తల్లిని దర్శించుకొని, రామనంద్, మాదవ్‌ రావ్‌ మహారాజ్‌లకు పూజలు చేస్తే, సర్వ పాపాలు తొలగుతాయని ప్రతీతి. కాగా గత కొన్ని సంవత్సరాలుగా కోవిడ్‌ తో ఈ జాతరకు భక్తులు పెద్దగా రాన్నప్పటికీ, ఈ ఏడాది జాతర జన సందోహంగా మారింది. నది ఒడ్డున ఇసుక తిన్నెలపై నిర్వహించే ఈ జాతరకు ఆదిలాబాద్‌ జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం జరుగుతుంది. ఈ ఏడాది సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మంగళవారం మూడవ రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి, ప్రత్యేక అభిషేకాలు చేసారు. రామనంద్, మాదవ్‌ రావ్‌ మహారాజ్‌ ఆలయాల్లో సైతం ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి పాదుకలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జాతరలో ఏర్పాటు చేసిన షాపుల్లో అలంకరణ సామాగ్రి, తినుబండరాలు కొనుగోలు చేస్తూ భక్తులు సందడి చేసారు. చిన్నారులు వివిద ఆటలు ఆడుతూ… ఆట వస్తువులతో హుషారుగా కనిపించారు.

భక్తులు తరలి రావాలి…

ఈ ఏడాది గంగా జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జర్గింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం దారి, పార్కింగ్, ఇతరాత్ర వసతులు కల్పించడం జర్గింది. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో నది తీరం పూర్తిగా జన సంద్రంగా మారింది. జాతర సమయంలో నదిలో పుణ్య స్నానాలు ఆచరించి, గంగమ్మ తల్లికి నైవేద్యాలు పెడితే అన్ని పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అమ్మవారికి కృపకు పాతృలు కావాలి.

-వైద్య ఉమేష్, సర్పంచ్, కామాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *