సిరాన్యూస్, ఆదిలాబాద్
స్వేరోస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పెంటపర్తి ఆశన్న
ఆదిలాబాద్ పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవనంలో మంగళవారం స్వేరోస్ ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. స్వేరోస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గా పెంటపర్తి ఆశన్న, ప్రధాన కార్యదర్శి గా ఉపారపు సత్యారాజ్ , ఉపాధ్యక్షులు గా శంకర్, కోశాధికారి గా కూర పాచ్చన్న, మీడియా కన్వీనర్ గా దాసరి ప్రవీణ్, కార్యదర్శులు కాంబ్లే రాజ్ రతన్, నరసింహులు, నారాయణ, సొన్ కాంబ్లె వికాస్, సాయి చరణ్ లను ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య చిలకబత్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దరమళ్ళ ప్రకాష్, స్వేరోస్ పూర్వ జిల్లా అధ్యక్షులు కాంబ్లే విజయ్ కుమార్, రాష్ట్ర నాయకులు ఉషన్న తదితరులు పాల్గొన్నారు.