– మంత్రి పొన్నం ప్రభాకర్
సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రకృతి విలయ తాండవం చేస్తున్నప్పుడు మనమందరం జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కువగా విపరీతమైన వర్షాలు పడుతున్నప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోండని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్యాబినెట్ మంత్రులు ,ఎమ్మేల్యేలు, ఎంపీలు పార్టీ మొత్తం పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. రాజకీయం చేసే వారు రాజకీయం చేస్తుంటారు..ప్రజలకు అండగా ఉండే బాధ్యత గల ప్రభుత్వంగా మేము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రకృతి విపత్తును అపగలిగే శక్తి ఎవరికీ లేదు. దాని నుండి ఏవిధంగా నివారించుకోవాలి..ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం నుండి చెప్తున్నాం. నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలని ప్రయత్నం చూస్తున్నాం..కేంద్రం నుండి సహకారం కోరుతున్నాం. మనం కూడా మన బాధ్యతగా కార్యక్రమాలు నిర్వహించుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా విపత్తు వస్తె రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరికి ఆదేశాలు ఇచ్చాం. అధికారులంతా స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలి. పార్టీ శ్రేణులు ప్రజల్లో ఉండి సహాయ కార్యక్రమాల్లో ఉండాలని మా పార్టీ నాయకత్వాన్ని కోరినం. మేము కూడా నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వం చేయడమే కాదు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉంటూ సహకారాలు అందించాలి. ప్రజా పాలన లో ఈ ప్రభుత్వం మీ అందరికీ అండగా ఉంటుందని మాట ఇస్తున్నానని అన్నారు.