దేవినేని ఉమా
సిరా న్యూస్,విజయవాడ;
జి కొండూరు మండలం కవులూరు లో తుఫానుకు దెబ్బతిన్న పొలాలను రైతులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. నాలుగేళ్లుగా కాలువలు, డ్రైన్లలో పూడిక తీయక నీరు బయటికి వెళ్ళక భారీగా నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఉమా మాట్లాడుతూ రైతులు ఆర్ బి కే ల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు అవి రైతు బోగస్ కేంద్రాలు. మేము కొనుగోలు చేయం మిల్లర్ల వద్దకు వెళ్ళమని చేతులు దులుపుకుంటున్నారు. ప్రకృతి విపత్తు వల్ల కొంత నష్టం జరిగితే వైసిపి ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం వల్ల భారీ నష్టం జరిగింది. తాడేపల్లి కొంపలోంచి ముఖ్యమంత్రి బయటకు వచ్చి దెబ్బతిన్న పొలాల్లో తిరగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జువ్వా రాంబాబు, తాడికొండ భాస్కరరావు తనికెళ్ళ సంపత్, నూతక్కి సునీల్, మన్నం వెంకట్రావు, సుఖవాసి శ్రీహరి, పటాపంచల నరసింహారావు, పూర్ణయ్య, ఆంజనేయులు, బుచ్చిబాబు, గాంధీ ఇతర నాయకులు పాల్గొన్నారు.