సిరా న్యూస్,వరంగల్;
వరంగల్‌లో ఓ వ్యక్తి పోలీసులకు ఊహించలేక షాక్ ఇచ్చాడు. ఇంట్లోకి చొరబడ్డ వీధి కుక్క ఎంతకు బయటికి వెళ్ళకపోవడంతో డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులను తన ఇంటికి రప్పించాడు. ఆ కుక్కను వారిచేతే బయటకు వెళ్ళగొట్టించాడు. ఈ విచిత్ర సంఘటన ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాజీపేటలో జరిగింది. ఇంటి యజమాని రాజేంద్రకుమార్ నిర్వాకం చూసిన పోలీసులు బిత్తరపోయారు.ఇంట్లోకి వీధి కుక్కలు చొరబడితే సహజంగా కర్ర పట్టుకొని బెదిరిస్తాం. ఏదో ఒక విధంగా ఆ కుక్కను భయపెట్టించి బయటకు వెళ్లగొడతాం. కానీ వరంగల్ గిర్మాజీపేటకు చెందిన రాజేంద్రకుమార్ అనే వ్యక్తి మాత్రం తన ఇంట్లోకి చొరబడ్డ కుక్కని వెళ్ళగొట్టడం కోసం డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసులను తన ఇంటికి రప్పించాడు. ఆ కుక్క ఎంతకు బయటికి వెళ్లడం లేదని, తరిమితే పైపైకి వచ్చి కరిచేందుకు యత్నిస్తోంది. మీరే వెళ్లగొట్టాలంటూ పోలీసులకు సూచించడం ఇప్పుడు ఓరుగల్లు హాట్ టాపిక్ అయింది.