Pidamarthy Ravi: ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ను వెంట‌నే చేప‌ట్టాలి

సిరా న్యూస్, ఆదిలాబాద్
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ను వెంట‌నే చేప‌ట్టాలి
* ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి
* ఆదిలాబాద్ హరిజనవాడలో జోడో యాత్ర
క‌మిటీల పేరుతో కాల‌యాప‌న చేయ‌కుండా మాదిగ‌ల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం ప్ర‌ధాన మంత్రి మోడీ ఎస్సీవ‌ర్గీక‌ర‌ణ‌ను వెంట‌నే చేప‌ట్టాలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు . గురువారం మాదిగల జోడోయాత్ర ఆదిలాబాద్ హరిజనవాడ లో కొనసాగింది. ఈ సందర్భంగా డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ  బిజెపి రిజర్వేషన్లకు వ్యతిరేకమని ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేసి ఈ రిజర్వేషన్లు దాదాపు తగ్గించిందని మళ్లీ బిజెపి పార్టీకి ఓటు వేస్తే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు జీవనం కొనసాగించడానికి ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వదని అలాంటి బీజేపీని ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలనిఅన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన మాదిగలు బిజెపి పార్టీని ఓడించడమే 30 ఏళ్ల వర్గీకరణకు మాదిగలు ఇచ్చే సంపూర్ణ మద్దతు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం ఎస్సి రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని అన్నారు. భారత దేశంలో బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం అతి ప్రమాదంలో ఉందని దీని కాపాడాల్సిన బాధ్యత చైతన్యవంతమైన మాదిగలపై ఎంతైనా ఉందని చెప్పారు. బిజెపిని తెలంగాణ రాష్ట్రం నుంచి తన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. మాదిగల జోడో యాత్ర రేపు ఉదయం ఇంద్రవెల్లి ఖానాపూర్ పెద్దపల్లి కరీంనగర్లలో ఉంటుందని అన్నారు.ఈకార్యక్రమంలో ఆదిలాబాద్ మాదిగ నాయకులు మల్లెల మనోజ్, నక్క రాందాస్, బరిక్ రావు,రవి, సరోజ,నేషనల్ దళిత సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బుదాల బాబురావు, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్, ఏం హెచ్ పి ఏస్ అధ్యక్షులు మైసా ఉపేందర్,మహా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ముత్యపాగం నరసింహారావు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ప్రసాద్, మాదిగ యూత్ జెసి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నక్క మహేష్,దేవరకొండ నరేష్, గద్దల రమేష్, జోగు గణేష్, మీసాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *