సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం ఎన్టీఆర్ నగర్ సమీపంలో చెన్నై శ్రీకాళహస్తి రహదారిపై నిర్మించిన పంట పొలాలకు పోయే కల్వర్టు బువారం తెల్లవారుజామున కుప్ప కూలింది. ఓవైపు తుఫాను దాటికి బీటలు వారగా మరోవైపు నిత్యం భారీ వాహనాలు వందల సంఖ్యలో కల్వర్టుపై నుండి ప్రయాణించడంతో కల్వర్టు కుంగినట్లు సమాచారం. ఈ దారి గుండా నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ కల్వర్టు మరమ్మతులు చేసి ప్రయాణానికి అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు స్థానికులు కోరుతున్నారు.