సిరా న్యూస్, ఆదిలాబాద్:
పిప్పల్‌ధరి యూపీఎస్‌లో నాసిరకంగా పనులు!?
+ పాత ఇటుకలు, నాణ్యత లేని ఇసుక వాడుతున్నట్లు ఆరోపణలు
+ పనుల్లో నాణ్యత పెంచాలంటున్న గ్రామస్తులు
ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలంలోని పిప్పల్‌ధరి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో రిపైర్ వర్క్స్ నాసికరంగా చేపడుతున్న గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు నెలల క్రితం మన ఊరు–మన బడి కింద పాఠశాల మరమత్తులకు రూ. 4.5 లక్షలు మంజూరు కాగా, ప్రసుత్తం పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ పనుల్లో నాణ్యత లోపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. నాసిరకమైన ఇసుక వాడటమే కాకుండా, రిసైక్లింగ్ చేసిన పాత ఇటుకలను వాడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సానిటేషన్ పనులు కూడ తూతూ మంత్రంగా చేపడుతున్నట్లు చెబుతున్నారు. కేవలం పాత గోడలకు కొత్త పూత వేసి, మొత్తం బిల్లులు కాజేసేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, పనులు నాణ్యతతో పూర్తి అయ్యేలా చూడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.