కోనసీమలో మంత్రి పదవులపై హైకమాండ్ వద్ద పైరవీలు

అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి పదవులపై పోటీపడుతున్న పలువురు ఎమ్మెల్యేలు..
సిరా న్యూస్,అమలాపురం;
ఎన్నికల ఫలితాల తర్వాత నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా విజయవాడ,హైదరాబాద్ లోనే వుంటూ మంత్రి పదవి కోసం పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఏడు కు ఏడు స్థానాలలో టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు గెలిచిన విషయం తెలిసిందే. కులాలు, సీనియారిటీ వారిగా మంత్రి పదవి నాకు వస్తుంది అంటే నాకు వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పలువురు ఎమ్మెల్యేలు. మరో రెండు రోజుల్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయవాడ, హైదరాబాద్ లోనే మకాం వేసి పలువురు ఎమ్మెల్యేలు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుండి సీనియర్ నేత అమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కు మంత్రి పదవి అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంఇ. కాపు సామాజిక వర్గం నుండి కొత్తపేట టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు దాదాపు మంత్రి పదవి ఖరారు అయింది, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కి కూడా మంత్రి పదవి అంటూ జిల్లలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్టాన పెద్దల వద్ద మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *