సిరా న్యూస్,నందిగామ;
ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఓడిపోతుందన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను మాజీ మంత్రి కొడాలి నాని ఖండించారు. పీకే ఒక చిల్లర మనిషి. పీకే తీసేసిన తాసిల్దార్ తో సమానం. ఐప్యాక్ నుండి అతన్ని తన్ని తరిమేశారు. బీహార్ లో పార్టీ పెట్టి హడావిడి చేసి డిజాస్టర్ అయిన పీకే….. ఇప్పుడు డబ్బులు తీసుకొని జ్యోతిష్యం చెప్పడం మొదలెట్టాడు. తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, ఎన్నికల్లో పీకే చెప్పిన జోస్యం ఏమైంది. లగడపాటి, పీకే లాంటి చిల్లర వ్యక్తులు….తమ వల్ల చంద్రబాబుకు ఒక శాతం ఓటింగ్ అయిన పెంచాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసిపి కోసం పనిచేసే వారితో సీఎం జగన్ సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో ఎలా గెలుస్తామో ఒంగోలు సభ ద్వారా సీఎం జగన్ చూపిస్తారు. మా మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాకు 24గంటలు సరిపోతుందని అన్నారు.