సాదాసీదాగా బండి సంజయ్ “హోం” బాధ్యతల స్వీకరణ

సిరా న్యూస్,న్యూఢిల్లీ;
కేంద్ర హోం శాఖ సహయ మంత్రిగా బండి సంజయ్ బాధత్యలుస్వీకరించారు.
సరిగ్గా 11 గంటలకు నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరై వేద మంత్రోఖ్చరణలతో బండి సంజయ్ కు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఆశిస్సులు అందచేసారు. బండి సంజయ్ కు సహచర మంత్రి నిత్యానంద రాయ్ పూల బొకే అందించి అభినందనలు తెలిపారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా అత్యంత నిరాడంబరంగా అయన బాధ్యతలు తీసుకున్నారు.
అంతకు ముందు తన అధికారిక నివాసంలో బండి సంజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ నుండి భారీగా తరలివచ్చారు. పూలబొకేలు, శాలువాతో సత్కరించి స్వీట్లు అందించి శుభాకాంక్షలు తెలిపారరు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజల రాకతో బండి సంజయ్ నివాసం. కోలాహలంగా మారిందిన
===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *