–డి ఆర్ డి ఓ కిషన్
—మొక్కల పెంపకం ప్రతి పౌరుని బాధ్యత.
—వృక్ష సంపద వెలకట్టలేని ఆస్తి
—పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు ప్రజాప్రతినిధులు
సిరా న్యూస్,తాండూర్;
ప్రాణకోటికి మొక్కలే జీవనాధారం గనుక ప్రాణవాయువులనిచ్చే మొక్కలను పెంచుకుందామని డిఆర్డిఓ కిషన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా తాండూర్ మండల్ లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డిఆర్డీఓ అనంతరం వారు మాట్లాడుతూ గతంలో పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి, చల్లని నీడను ఇచ్చే చెట్లు ఇప్పుడు కనిపించటం లేదన్నారు. భవిష్యత్తు ముందు తరాలకు మంచి జరగాలి అంటే ఇప్పుడు నుండే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అశోక చక్రవర్తి భవిష్యత్తు గురించి ఆలోచించి మొక్కలు నాటారన్నారు. అవే మొక్కలు రోడ్లకు ఇరువైపులా ఉన్నాయన్నారు. డిపార్టమెంట్ కాక ఇళ్ళలో కూడా మొక్కలు నాటే బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. గతంలో పందిర్లకు తీగలు మొక్కలు ఉండేవి…ఇప్పుడు చూద్దామన్న కనిపించటం లేదన్నారు.వాడ ఊరు బాగుండాలని లక్ష్యంతో అందరు మొక్కలు నాటాలన్నారు. ప్రజలను భాగస్వామ్యం చెయటం కోసమే మొక్కలు నాటే కార్యక్రమం చెపట్టామన్నారు. ఊర్లలో కోతుల బెడద చాలా ఉందని తెలిపారు. అడవిలో దొరికే ఫలాలను కొతులకు అందేలా చూడాలని తెలిపారు.కాలుష్యం నివారణ చెయ్యాలన్న మొక్కలను పెంచటమే ఒకే ఒక్క మార్గమని
తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కను నాటాటమే లక్ష్యంగా భావించి మొక్కలు నాటి లక్ష్యన్ని చెరుకోవాలని తెలిపారు.మనిషి మనుగడ కలగాలి అంటే చెట్లను పెంచాలన్నారు. గతంలో పెద్దలు 100 సంవత్సరాలు బతికారు అంటే చెట్లే కారణం అన్నారు. ప్రతి నిత్యం మనిషి జీవితంలో చెట్లతో అవసరం ఉంటుందన్నారు. జ్ణానం పెంపోదించుకోవాలన్న పచ్చని చెట్ల కిందకు వెళితే ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. చెట్లను నరకటం మహపాపం అన్నారు. చెట్లను పెంచాలనే ఉద్దేశ్యంతో అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. ఒక్కొక్క వ్యక్తి ఐదు నుండి పది మొక్కలు పెంచితే వన మహోత్సవ కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. అంతకుముందు అధికారులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా సుమారు 300 వరకు మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్,ఎంపీవో అనిల్ కుమార్,ఆర్ఐ అంజన్ కుమార్, కస్తూర్బా పాఠశాల ఎస్ఓ సుమన చైతన్య, ఏపీఎం పుమానాయక్, ఏపీవోనందకుమార్,పంచాయితీ కార్యదర్శి దివాకర్, తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్,మాజీ జెడ్పిటిసి సాలిగామబానయ్య,తాండూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ఈసా,మాజీ ఎంపీటీసీలు సిరంగి శంకర్,సూరంరవీందర్,మసాడి శ్రీదేవి,మాజీ కోఆప్షన్ రెహమత్ ఖాన్, తాండూర్ మండల్ ప్రజా ప్రతినిధులు గట్టు మురళీధర్,మహేందర్ రావు, దత్తాత్రేయ రావు,ఎల్క రామ చందర్,శంకర్ గౌడ్,మహమ్మద్ ఆబ్సాధ్,మాస వెంకట్ స్వామి,పేర్క రాజన్న,రమేష్ సాగర్,జావిద్,గౌస్,యువ నాయకులు చింటూ,అనిల్ కుమార్,నవీన్,ప్రవీణ్,విక్కీ,విష్ణు,శివకుమార్,పాఠశాల సిబ్బంది,పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.