ఆడుదాం
ఆంధ్ర టోర్నమెంట్లో పాల్గొను యువతి యువకులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
ఎంపీడీవో సుబ్బరాజు
సిరా న్యూస్,కౌతాళం;
మండలంలో ఆడుదాం ఆంధ్ర రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్లో సచివాలయ స్థాయి లో క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖో ఖో మొదలైన ఐదు గేమ్స్ లో పాల్గొనదలచిన యువతి యువకులను రిజిస్ట్రేషన్ చేయించవలసినదిగా సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు ఎంపీడీఓ సుబ్బరాజు పేర్కొన్నారు. శుక్రవారం మండల కార్యాలయంలో ఆడుదాం టోర్నమెంట్ కార్యక్రమం సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా మండల నాయకులు ప్రహ్లాద చారి,ఎంపీపీ అమారేశప్ప మండల కు ఆప్షన్ నెంబర్ మాబుసబ్ స్పెషల్ జిల్లా అధికారి ఆచార్యులు ఎంఈఓ శోభారాణి హాజరయ్యారు. అటపోటిల కోచ్ రాజశేఖర్ మాట్లాడుతు సచివాలయాలను సందర్శించి 15 సంవత్సరాల పైబడిన ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించి వారి ప్రతిభను వెలికి తీసే విధంగా గ్రామాలలో విస్తృతంగా అవగాహన కల్పించి ఎక్కువమంది తమ పేర్లను నమోదు చేసుకునే విధంగా సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు కృషి చేయాలని తెలిపారు. సచివాలయ స్థాయిలో ఈ క్రీడలను పర్యవేక్షించనున్న ప్రత్యేక అధికారుల మరియు వ్యాయామ ఉపాధ్యాయుల సమన్వయంతో ఈ పోటీల నిర్వహణ జరుగుతుందని తెలిపారు. సచివాలయ స్థాయిలో గెలుపొందిన వారిని మండల స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో ఉన్న ప్రజా ప్రతినిధులను, క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వారిని భాగస్వాములను చేసి సచివాలయ పరిధిలో డిసెంబర్ నెల 15వ తేదీ నుండి నిర్వహించనున్న క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.