Pleasent Park: ఆహ్లాదం ఈ పార్క్ సొంతం.. విశేషాలు తెలుసుకోవాలంటే ఒక్కసారి చూడాల్సిందే..

సిరా న్యూస్, డిజిటల్:

ఆహ్లాదం ఈ పార్క్ సొంతం.. విశేషాలు తెలుసుకోవాలంటే ఒక్కసారి చూడాల్సిందే..

ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలు సైతం కాంక్రీట్ జంగల్ గా మారిన తరుణంలో, జనాలు పచ్చదనం కోసం పరితపిస్తున్నారు. పచ్చని చెట్లు కనుచూపుమేర కనిపించని పరిస్థితి ఉండడంతో పార్కుల వైపు పరుగులు తీస్తున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో చిన్న పెద్ద తేడా లేకుండా పార్కుల బాట పట్టారు. దీంతో ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలోని గాంధీ పార్క్ సందర్శకులతో కిటకిటలాడుతోంది. చిన్నారులు బోటింగ్, మిక్కీమౌస్, లోకల్ ట్రైన్ లలో ఆడుకుంటూ సందడి చేస్తున్నారు. జనాలు కుటుంబ సభ్యులతో కలిసి పార్కు విచ్చేసి వనభోజనాలు, ఫోటోషూట్, ఇన్స్టారీళ్లతో హోరెత్తిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *