సిరా న్యూస్, గుడిహత్నూర్
ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటు ప్రక్రియ: పీఓ వెంకటేష్
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని వివిధ గ్రామాలలో వృద్దులు, పోలింగ్ బూత్ కి వెళ్లలేని వారు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు. ఈసందర్భంగా పీఓ వెంకటేష్ మాట్లాడుతూ మన్నూర్, కొల్లారి, డోoగర్గావ్, ముత్నూర్, ముత్నూర్ తండా,గ్రామాలలో 12 మంది ఉన్నారని, వారితో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఓ ఓంప్రసాద్, మైక్రో అబ్సర్వర్ రాజేష్, బి ఎల్ ఓ గజభారే విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.