తెలంగాణ వచ్చినంక మన పండుగలకు గుర్తింపు
జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత
సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల పట్టణ హనుమాన్ వాడలో శ్రీ హనుమాన్ మున్నూరుకాపు సేవాసంఘం వారి పోచమ్మ బోనాల సందర్భంగా జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత -సురేష్,మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి -లక్ష్మణ్,వార్డు మహిళలతో కలిసి డప్పు చప్పుల్ల మధ్యలో బోనం ఎత్తుకున్నారు. సరైన సమయంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని రైతులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పోచమ్మ తల్లి కృప కటాక్షము అందరి పై ఎల్లపుడు ఉండాలని జగిత్యాల జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారు పోచమ్మ తల్లిని వేడుకున్నారు…ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కూతురు పద్మ,రాజేష్ నాయకులు కూతురు శేఖర్,చింతల గంగాధర్,మహిళలు తదితరులు పాల్గొన్నారు…*జగన్నాథ రథయాత్రలో జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత,
మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి*
జగిత్యాల పట్టణంలో జగన్నాథ రథయాత్రలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రలో జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత -సురేష్ ,మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ తోకలసి పాల్గొన్నారు.
జగన్నాథ రథాన్ని అక్కడున్న భక్తులతో కలిసి లాగుతూ ముందుకు కొనసాగారు..జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునిపై స్వామివారి కృప కటాక్షాలు ఉండాలని కోరుతూ సుఖ సంతోషాలతో కలకాలం ఉండాలని ఆ భగవంతుని వేడుకున్నానని వారు తెలిపారు.వారి వెంట కౌన్సిలర్ అవారి శివకేసరి బాబు,నాయకులు ప్రతాప్,భగవాన్ రాజ్,జగన్నాథ రథయాత్ర కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు…