Pochamma Bonalu: ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు…

సిరా న్యూస్, చిగురుమామిడి:

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు…

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29 జరిగే పెద్దమ్మ పండుగ సందర్భంగా ఆదివారం రోజున పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ముదిరాజులు ఇంటికో బోనం చొప్పున పోచమ్మ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. డప్పు చప్పుల మధ్య పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మెడబోయిన తిరుపతి, ఆలయ కమిటీ చైర్మన్ గందె సంపత్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గందె సంతోష్, సంఘం నాయకులు మారుపాక రమేష్, మెడబోయిన తిరుపతి, పెసరి శ్రీనివాస్, పిట్టల తిరుపతి, పెసరి సంతోష్, గందె మల్లయ్య, గందె శ్రీనివాస్, పెసరి శ్రీనివాస్, బొల్లి సంపత్, గిరబోయిన సాదయ్య, బొల్లి శ్రీనివాస్, పెసరి రాధాకృష్ణ, కాశబోయిన నర్సయ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *