సిరా న్యూస్,హైదరాబాద్;
వ్యవసాయ శాఖ సలహాదారులుగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పబ్లిక్ గార్డెన్ లోని హార్టికల్చర్ ఆఫీసులో పోచారం బాధ్యతలు స్వీకరించారు.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ మినిస్టర్ మంత్రి జూపల్లి కృష్ణారావు, బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు హాజరయ్యారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం. 2024 జూన్ 21న సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. పోచారం కొడుకు, నిజామాబాద్ డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి కూడా తండ్రితోపాటే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.