Pochchera water Falls: పొచ్చెర జలపాతం సంద‌ర్శ‌న‌ నిలిపివేత

సిరాన్యూస్, బోథ్‌
పొచ్చెర జలపాతం సంద‌ర్శ‌న‌ నిలిపివేత

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర జ‌ల‌పాతం సంద‌ర్శ‌న‌కు అనుమతి లేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం పొచ్చెర జలపాతం వ‌ద్ద‌ కంచెను ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా జలపాతం వద్ద సందర్శకుల తాకిడి పెరిగి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున ముందస్తుగా ఈ చర్యలు చేప‌ట్టిన‌ట్లు అట‌వీశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు జలపాతం వద్ద అటవీ శాఖ సిబ్బంది సైతం సందర్శకులు రాకుండా అటువైపు వెళ్ళకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *