ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రజలు
సిరా న్యూస్,మంథని;
మంథని మండలం లోని లక్కేపూర్, తోటగోపయ్య పల్లి, గంగపూరి, కాకర్లపల్లి గ్రామాలతోపాటు మరికొన్ని గ్రామాలలో ప్రజలు తీవ్రమైన విషజ్వరాలతో గత కొద్ది రోజులుగా బాధ పడుతున్నారు. ఈ గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు పూర్తి పేద మధ్యతరగతి కి చెందిన వారు కావడంతో ప్రైవేటు హాస్పిటల్స్ లో వైద్య ఖర్చులు వేల రూపాయలు వెచ్చించి చికిత్స చేయించుకునే స్తోమత లేకపోవడంతో వైద్యం భారంగా మారింది. ఓకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు కీళ్ల నొప్పులు, జ్వరంతో నీరసించిపోయి ప్రభుత్వ వైద్యశాలలకు పోయే పరిస్థితి లేకపోవడంతో ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. జిల్లా వైద్యాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విష జ్వరాల నివారణకు సహకరించాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా గ్రామాలలో పాలకమండలి లేకపోవడంతో పారిశుద్ధం పడకేసినట్టుగా కనబడుతుంది.