కస్టమర్లు, యువతులు అరెస్టు
సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. టాస్ పబ్పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా యువతులతో పబ్లో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తుండగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పబ్కు కస్టమర్లను ఆకర్షించేందుకు 42 మంది యువతులతో నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అశ్లీలంగా డ్యాన్సులు చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు పబ్పై కేసు నమోదు చేశారు. దాడి చేసిన సమయంలో పబ్లో మెుత్తం 100 మంది పురుషులను… 42 మంది మహిళలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పబ్ కు వచ్చే కస్టమర్లకు ఎరగా యువతులు పబ్ నిర్వాహకులు ఈ యువతులను పబ్ కు వచ్చే కస్టమర్లకు ఎరగా వేస్తున్నారు. కస్టమర్లతో చనువుగా ఉంటూ డాన్సులు వేస్తూ వారితోనే పాటు మద్యం సేవిస్తున్నట్లు నటిస్తారు. కానీ వారు తాగేది కూల్ డ్రింక్స్ మాత్రమే… కానీ కస్టమర్ లతో మాత్రం మద్యం తగుతున్నట్లు నమ్మిస్తారు. చివరిగా వారి బిల్లులోనే యువతులు తాగిన బిల్లును కలిపి కస్టమర్ల జేబులకు చిల్లుపెడుతున్నారు.