కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోకూరెళ్ల గ్రామంలోని పెద్ద చెరువు లో నల్ల మట్టి పట్టివేత..
సిరా న్యూస్,కోహెడ;
కూరెళ్ల, మండలం కోహెడ, అతను ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా చెరువులో నుండి నల్ల మట్టిని, జెసిపి తొమ్మిది ట్రాక్టర్లతో తన ఇటుక బట్టీల వద్దకు తరలిస్తున్నాడని, నమ్మదగిన సమాచారం రాగా
సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది కోహెడ ఎస్ఐ తిరుపతి, సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు.
కోహెడ పోలీసులు పూర్తి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, మాట్లాడుతూ. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక రేషన్ బియ్యం, అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం, గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
గ్రామాలలో, పట్టణాలలో ఇసుక అక్రమ రవాణా చేసిన, పిడిఎస్ రైస్ అక్రమంగా దాచిపెట్టిన రవాణా గ్యాంబ్లింగ్, పేకాట, మరిఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445. 8712667446. 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
========================XXX