సిరా న్యూస్,కరీంనగర్;
సోమవారం ఉత్తర తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దామెరతోగు – రంగాపురం మధ్య అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా బంద్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. జెఎండబ్ల్యూ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ దామెరతోగు ఎన్ కౌంటర్ లు నిరసనగా బంద్ పిలుపునిచ్చారు. ఒకవైపు మావోయిస్టు వారోత్సవాలు & మరోవైపు బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
మహారాష్ర్ట, తెలంగాణ, చెత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు జరిపారు. వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, మహాదేవపూర్ మండలాల్లో విస్తృతంగా తనిఖీలు జరిగాయి. గుత్తికోయగూడాల పై ప్రత్యేక నిఘా వుంచారు. మావోయిస్టులు ఎలాంటి విధ్వంసానికి పాల్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.