సిరా న్యూస్,నల్గోండ;
కరడు కట్టిన పార్ధీ ముఠా ఓ వ్యాన్లో ప్రయాణిస్తున్న విషయం తెలుసుకున్న నల్గొండ పోలీసులు వాళ్లను పట్టుకునేందుకు మాటు వేసారు. పోలీసులను చూసిన ముఠా సభ్యులు ఒక్క సారిగా పోలీసులపై దాడికి ప్రయత్నించారు.దాంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. కొంతమంది పార్థ ముఠా సభ్యులు పారిపోగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్ పెద్ద అంబర్పేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది