సిరాన్యూస్,జైనథ్
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం… కేంద్ర బలగాలతో పోలీసుల కవాతు..
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం కేంద్ర బలగాలతో పోలీసుల కవాతు నిర్వహించామని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్.జీవన్ రెడ్డి అన్నారు. జైనథ్ సి.ఐ డి.సాయినాథ్, సీఆర్పిఎఫ్ సి.ఐ సూరజ్, జైనత్ ఎస్ఐ పురుషోత్తం, పోలీస్ సిబ్బంది కేంద్ర బలగలైన సీఆర్పీఎఫ్ తో కలిసి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని దీపాయిగూడ, ఆనందపూర్ గ్రామాలలో పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజనుద్దేశించి సీ.ఐ డి.సాయినాథ్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడవద్దని, బెల్ట్ షాపు లు నిర్వహించారాదని, గొడవలకు తావు లేకుండా పోలీస్ లు ఎల్లవేళల ప్రజల కోసం పని చేస్తారని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరగడానికి ఈకార్యక్రమం నిర్వహించినట్లు జైనత్ ఎస్.ఐ తెలిపారు.