78 వేల నగదును,కత్తులు, పుంజులు స్వాధీనం
పదిమంది అరెస్ట్
సిరా న్యూస్,జగ్గంపేట;
జగ్గంపేట మండలం నరేంద్ర పట్నం గ్రామంలో రాత్రి సమయంలో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చినట్లు స్టానిక ఎస్ఐ టి రఘునాధరావు తెలిపారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ మంగళవారం అర్థరాత్రి మండలంలోని నరేంద్ర పట్నం మామిడాడ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాలపై దాడులు నిర్వహించమని ఆయన తెలిపారు. ఈ దాడుల్లో కోడిపందాలు ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 78 వేల నగదును, రెండు కోడి పుంజులు, రెండు కోడి కత్తులను స్వాధీనం చేసుకునామన్నారు. పదిమంది పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచడం జరిగిందన్నారు. మండలంలో ఎక్కడైనా కోడిపందాలు గానీ, సారా బట్టి స్థావరాలు గాని నిర్వహించినట్లు తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచారం అందజేయమని ఆయన తెలిపారు.