సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో 17బెటాలియన్ పోలీసుల భార్యలు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేసారు. మా భర్తలకు డ్యూటీలు వేసి మాకు, మా సంసారాన్ని కుటుంబాన్ని దూరం చేస్తున్నారని అవేదన పడ్డారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాన్ని అమలు పరుచాలని డిమాండ్ చేసారు. మా భర్తలను లోపల కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చెపిస్తున్నారని ఆందోళన చేసారు. పోలీసు డ్యూటీకి మా భర్తలు చేస్తున్న పనికి సంబందం లేదనిఅంటున్నారు. రోడ్డెక్కిన పోలీసు భార్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను అరెస్ట్ చేసి 17 బెటాలియన్ కు తరలించారు.