సిరాన్యూస్, హుస్నాబాద్:
కాటన్ వస్త్రాలను ప్రోత్సహించండి : మంత్రి పొన్నం ప్రభాకర్
చేనేత పరిశ్రమలు కాపాడండి ..కాటన్ వస్త్రాలను ప్రోత్సహించండి అని రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అతిథులకు, పెద్దలకు మర్యాదలు చేసేటప్పుడు శాలువాలకు బదులుగా కాటన్ వస్త్రాలను ప్రోత్సహించాలన్నారు. అలాగే రాజకీయ ప్రముఖుల దగ్గరికి వెళ్ళే అప్పుడు శాలువాలకు బదులుగా కాటన్ వస్త్రాలను ఇస్తే అటు ఆర్థికంగానూ సౌకర్యంగానూ చేనేత పరిశ్రమలు బలోపేతం చేసిన వాళ్ళం అవుతమన్నారు. వీటికి బదులుగా పిల్లలకు ఉపయోగపడే పెన్నులు, పుస్తకాలు ఇస్తే ఇంకా చాలా సంతోషిస్తా అని మంత్రి అన్నారు.