Ponnam Prabhakar: మోడీ వ్యాఖ్య‌ల‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

సిరాన్యూస్‌,హుస్నాబాద్:
మోడీ వ్యాఖ్య‌ల‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

ఉచిత బస్సు సౌకర్యాల పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల పై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాన మంత్రి స్థాయిలో జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. వాస్తవంగా ఆర్టీసి లో ప్రయాణానికి మెట్రో ప్రయాణానికి సంబంధం లేదు మెట్రో సెక్టార్ వేరు ఆర్టీసి వేరని అయన గుర్తుచేశారు. ఇప్పటికీ కూడా మెట్రో లో బోగి లు పెంచాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. ప్రధానమంత్రి రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచన చేస్తున్నారా అని ఎద్దేవా చేసారు. బస్సు ప్రయాణం విషయంలో ప్రధాన మంత్రి ఎందుకు అలా మాట్లాడుతున్నారో విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇంకా రూట్లు పెంచి కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతమని పేర్కొన్నారు. ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించడంలో మా ప్రయత్నాలు మరింత ముందుకు కొనసాగుతాయని గుర్తుచేశారు. ప్రధానమంత్రి మహిళలకు బస్సు సౌకర్యం పై ఆడిపోసుకోవడం బంద్ చేసుకోవాలని అన్నారు. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఎదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదుని, ఇలా చిన్న చిన్న అంశాల పై మాట్లాడి ప్రధాన మంత్రి స్థాయి దిగజార్చుకోవద్దని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *